25 July, 2026 | 11:13 AM

ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేత

25-07-2026 10:38 AM

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party) నిరసన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా, మధ్య ఢిల్లీలోని 18 ఢిల్లీ మెట్రో స్టేషన్లు(Delhi Metro stations) శనివారం నాడు వరుసగా నాలుగవ రోజు కూడా మూసివేసి ఉంచినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(Delhi Metro Rail Corporation) ప్రకటన చేసింది. DMRC ప్రకారం, ఉదయం 7.30 గంటల నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేషన్లు మూసివేయబడతాయని ప్రకటనలో తెలిపింది.

అయితే, రాజీవ్ చౌక్, మండి హౌస్ , సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమం మార్గ్, బరాఖంభా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థం, జనపథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ITO, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం, ఝండేవాలన్, న్యూఢిల్లీ ఉన్నాయి. మెట్రో స్టేషన్లు మూసివేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.