25 July, 2026 | 11:20 AM

సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

25-07-2026 10:44 AM

ఎర్రుపాలెం జూలై 25(విజయక్రాంతి): మండల పరిధిలోని జమలాపురం హైస్కూల్ నందు గ్రామ సర్పంచ్  తుళ్ళూరి నిర్మలా కుమారి  సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లపురెడ్డి వెంకటరామిరెడ్డి, నన్నపనేని రామారావు, మండల ఎస్టి  సెల్ అధ్యక్షులు అత్మ కమిటీ డైరెక్టర్ బాణావత్ శ్రీను, భూక్యా బాలాజీ, చొప్పవరపు శ్రీనివాసరావు,తదితర నాయకులు పాల్గొని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు  ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.