17 April, 2026 | 3:37 PM

Breaking News

జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •  

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్

17-04-2026 02:35 PM

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ను పార్లమెంట్ విస్తరణతో ముడిపెట్టడాన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, డీలిమిటేషన్ "రాజకీయ డీమోనిటైజేషన్"కు(Delimitation) సమానమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్(Shashi Tharoor) శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయ కారణాల వల్ల మహిళా రిజర్వేషన్లు మరింత ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women's Reservation Bill) ఏకగ్రీవంగా ఆమోదం పొందాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ కు ఎందుకు ముడిపెట్టారని శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కలతో డీలిమిటేషన్ చేస్తాంటున్నారు.. డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామంటున్నారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్యాబలంతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. డీలిమిటేషన్ ముడిపెట్టడం మహిళా రిజర్వేషన్ల ఆశయాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు.