calender_icon.png 3 December, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు 21 డెలివరీలు

03-12-2025 01:57:57 PM

తల్లి పిల్లలంతా క్షేమం సిబ్బందికి అభినందనలు

కల్వకుర్తి: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల వ్యవధిలో 21 డెలివరీలను వైద్యులు విజయవంతంగా  పూర్తి చేశారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని వైద్యులు 24 గంటలు నిరంతరాయంగా సేవలందించి ప్రసవాలు చేశారు. అందులో 11 నార్మల్ డెలివరీలు, మిగిలినవి సిజేరియన్ పద్ధతిలో జరగగా, తల్లులు – శిశువులు క్షేమంగా ఉన్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు. అధిక సంఖ్యలో ప్రసవాలు జరిగినప్పటికీ ఎలాంటి అత్యవసర సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించిన వైద్య బృందం ప్రతిభను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.  విధులు నిర్వహించిన వైద్యులు, నర్సులు,పారిశుద్ధ్య సిబ్బందిని ఆసుపత్రి  సూపరెండెంట్ డాక్టర్ శివరాం అభినందించారు.