03-12-2025 02:01:21 PM
గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు పరిశీలించి పునరుద్ధరణకు హద్దులు
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి వెంకటాపూర్ గ్రామం నుండి దొంతి గ్రామానికి గతంలో నక్ష రోడ్డు సక్రమంగా ఉండేది. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోడ్డు కబ్జాకు గురి అయ్యిందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు, మరియు సంబంధిత మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రహదారి కబ్జాకు గురి కావడంతో చుట్టుపక్కల వ్యవసాయదారులకు, పాఠశాలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇందులో భాగంగా తూప్రాన్ సర్వేయర్ మరియు ఆర్ ఐ కబ్జాకు గురైన నక్ష రోడ్డు వద్దకు వచ్చి పరిశీలించారు. అనంతరం నక్ష రోడ్డు పునరుద్ధరణ కు హద్దులను ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.