18-03-2025 01:38:14 AM
పెన్ పహాడ్, మార్చి 17: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని 11 ఉన్నత పాఠశాల లోని పదో తరగతి చదువుతున్న 320 మంది విద్యార్థులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఈఓ చంద్రశేఖర్ రాజు తన స్వంత ఖర్చులు వెచ్చించి పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి నకిరేకంటి రవి మాట్లాడుతూ.. పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించడం సంతోషకరమన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా మండలంలోని పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రిని అందిస్తున్నందుకు వారికి మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ,ఏఎన్‌ఎం వీరమ్మ ,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి అర్ పి లు సైదయ్య , వహీద్ , నాగు పాల్గొన్నారు