15 March, 2026 | 11:35 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

18-02-2026 09:32 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కౌన్సిలర్ స్వప్నరాణి తెలిపారు. బుధవారం 5వ వార్డు పరిధిలోని బజార్ వాడి, రహ్మాత్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను గుర్తించిన కౌన్సిలర్ స్వంత నిధులతో నూతన వాటర్ మోటర్ ఏర్పాటు చేసి నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం అందించారు. కాలనీలోని జంజీరాల తిరుపతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి స్లాబు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  స్వప్నరాణి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని, ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని తెలిపారు. కౌన్సిలర్ స్వప్నరాణిని  వార్డు ప్రజలు సాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అసద్ ,ఖలీమ్ , అనుమాండ్ల సాయి కృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.