calender_icon.png 18 February, 2026 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

18-02-2026 09:39:16 PM

జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడే

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడే తెలిపారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం భీంగూడ్ కుటుడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు అయినా కొలం కాలనీలో డిఈ బండా వీరేష్, కన్స్ట్రక్షన్ ఏఈ శ్రీకాంత్, ఆసిఫాబాద్ రూరల్ ఏఈ ఊర్మిలలతో కలిసి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించి విద్యుత్ సరఫరా చేశారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ మాట్లాడుతూ కొలం కాలనీకి చెందిన 6 గురు  లబ్ధిదారులకు డిఎజెజియుఎ పథకం క్రింద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ స్కీం క్రింద ఇప్పటి వరకు 10 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామంలో అంగన్వాడి  కేంద్రానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సందర్భంగా కాలనీవాసులు అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.