15 April, 2026 | 7:15 AM

108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం..

12-01-2026 12:20 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి11: పురిటి నొప్పులతో సతమతమవుతున్న మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది.వివరాల్లోకి వెళితే తిరుమలగిరి పట్టణానికి చెందిన ఎస్ శైలజ ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది గర్భిణీని సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి స్టేజి వద్దకు రాగానే నొప్పులు అధికం కావడంతో వాహనంలోని ఈఎంటీ వీరకుమార్, ఆశా కార్యకర్త రహేలా తమ విధుల్లో భాగంగా మహిళకు ప్రసవం చేశారు. పండంటి బాబు జన్మించగా తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు.అనంతరం తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించారు.108 సిబ్బందికి శైలజ భర్త కోటిలింగం, కుటుంబీకులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.