12-01-2026 12:19:39 AM
ములకలపల్లి, జనవరి 11 (విజయక్రాంతి): నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి తిమ్మంపేట, పొగళ్లపల్లి రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని యువకులకు రాజీవ్ నగర్ కాలనీలో ఈనెల 12,13 వ తేదీల్లో వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.జనవరి 12వ తేదీ నుండి 13 తేదీ వరకు అంజయ్య,మహేష్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ 2 పోటీలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి తిమ్మంపేట, పొగళ్లపల్లి పంచాయతీల పరిధిలోని యువకులు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులని వారు పేర్కొన్నారు.జనవరి 12 వ తేదీ ఉదయం వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డ్రాలు అప్పుడే తీయడం జరుగుతుందని, ఈ పోటీలలో గెలిచిన వారికి మొదటి బహుమతి :6000, రెండోవ బహుమతి: 4000, మూడవ బహుమతి : 2000,నాలుగోవ బహుమతి : 1500 చొప్పున నగదు బహుమతులను అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ గ్రామాల పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ లోని బూర్గువాయ్ గ్రామానికి ప్రత్యేక ఆహ్వానం ఉందని ఆ గ్రామానికి చెందిన క్రీడాకారులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ఈ క్రీడలలో పాల్గొనదలచిన జట్లు ఎంట్రీ ఫీజ్ కింద 400 రూపాయలు చెల్లించాలని ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి నగదు బహుమతులతో పాటు షీల్ బహుకరించబడునని ఏ గ్రామనికి చెందిన ప్లేయర్ ఆ గ్రామంలోని జట్టులోనే ఆడాలని, క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని రిజిస్ట్రేషన్ కొరకు 6300815458,6302150182 ఈ సెల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.