calender_icon.png 12 January, 2026 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు సీపీఎం సిద్ధం

12-01-2026 12:22:47 AM

ఎర్రుపాలెం జనవరి 11 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మధిర మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. ఆదివారం సిపిఎం మధిర పట్టణ కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, ముఖ్య నాయకుల జనరల్ బాడీ సమావేశం స్థానిక సిపిఎం ఆఫీస్ నందు పాపినేని రామ నరసయ్య  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోతినేనిసుదర్శన్ రావు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పక్షాన సిపిఎం పోరాడుతుందని అన్నారు. సిపిఎం ప్రజల్లో ఉంటూ  సమస్యలపై పోరాటాల నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.

సిపిఎం పార్టీ నిత్యం మహిళలో రైతులు కూలీలు కార్మికులు యువకులు విద్యార్థులు సమస్యల పైన పనిచేయటం వలన ప్రజల్లో పార్టీ బలం పెరిగిందని దీనికి నిదర్శనం ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బల్పర్చిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో గెలవటమే అన్నారు. ఉద్యమాల కెల్లా ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ తన సత్తా చాటి 26 సర్పంచులు 33 ఉప సర్పంచ్లు 387 వార్డ్ మెంబర్లను గెలిపించుకుని ప్రతిపక్ష పార్టీ వ్యవహరించిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కారం: నున్న నాగేశ్వరరావు.

ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. నగర మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్వహించారని వాటిలో చాలా ప్రజాపోరాటాల ద్వారా పరిష్కారమయ్యాయి అని తెలిపారు. సిపిఎం పార్టీ చేపట్టిన వంద పడకల ఆసుపత్రి ప్రారంభించాలని సంతకాల సేకరణ, పాదయాత్ర జిల్లా కలెక్టర్ వినతి  పత్రాల అందించడం ద్వారా సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోవటంవలనే నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాలని లేకపోయినా ప్రజా ఒత్తిడితో దానిని  నేడు ప్రారంభిస్తానని ప్రకటన చేయటం ప్రజా ఉద్యమ ఫలితమేనని తెలిపారు.

మధిరలో ముస్లింస్ కాలనీ హనుమాన్ కాలనీ ఎంప్లాయిస్ కాలనీ దీర్ఘకాలంగా వర్షాకాలం వస్తే ముంపుగురు కావటం జరుగుతుంది దీనిని ఆ ప్రాంత ప్రజలను  సమీకరించి సుమారు రెండు గంటల పైన రాస్తారోకు చేయటం ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులను రప్పించి ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా ఆనాడు పరిష్కార మార్గాని చేయించడం జరిగింది. ఇలా సిపిఎం పార్టీ ప్రజలలో నిత్యం సమస్యల కోసం ప్రజా పోరాటాల నెరవేస్తూ అధికారి దృష్టి తీసుకుపోవడం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కార కోసం పోరాడే సిపిఎం పార్టీ సభ్యులను ఎన్నుకోవాలని దాని ద్వారా మాత్రమే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్న తెలిపారు.

అభివృద్ధి అంటే కాగితాల మీద కాదు చేతల్లో ఉండాలి: పొన్నం. 

అభివృద్ధి అంటే కోట్ల రూపాయలను కాగితాల మీద చూపించడం కాదని పేద మధ్యతరగతి వర్గాల ఉపయోగంగా ఉండాలని పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు.  బట్టి విక్రమార్కు గత నాలుగు పర్యాయాల నుండి శాసనసభ్యులుగా ఎన్నికైన గాని నేటికీ పేద ప్రజల కోసం ఏ అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఆనాడు సిపిఎం పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఉన్న బోడెపుడి వెంకటేశ్వరరావు కట్టా వెంకట నరసయ్యల కృషి ఫలితంగానే పేద ప్రజలకు ఎస్సీ కాలనీలోని, బంజర కాలనీ ముస్లిమ్స్ కాలనీ హనుమాన్ కాలనీ ఎంప్లాయిస్ కాలనీ లలో ఇళ్ల స్థలాలు ఇల్లు వందలాదిగా ఇవ్వటం జరిగిందన్నారు.

ఈనాడు అధికారం చేతిలో ఉన్నా బట్టి  ఒక్క గజం జాగా కానీ ఒక్క ఇల్లు కానీ నేటికీ పేద ప్రజలకు అందించలేదన్నారు. ఇప్పటికే పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం,ఇళ్ల కోసం, పింఛన్ల కోసం, రేషన్ కార్డుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని పేద ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు తీర్చకుండా తమ కమిషన్ల కోసం కోట్ల రూపాయలను కాగితాల రూపంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు.

ప్రజలకు కావలసిన కనీస మౌలిక సౌకర్యాలను కల్పించిన తర్వాత మాత్రమే సౌకర్యాలు లాంటివి కల్పించాలని అన్నారు. ఇప్పటికే బట్టి తమ కమిషన్ కోసం చేపట్టిన అండర్ డ్రైనేజీ పనుల ద్వారా ప్రజల అనేక రకాల ఇబ్బందులు పట్టడమే కాకుండా ప్రాణాలను కోల్పోవడం కాళ్లు చేతులు ఇరగ కొట్టుకోవడం లాంటి నష్టాలు ఎన్నో జరిగాయని తెలిపారు, ఇప్పటికైనా బట్టి పేద ప్రజలకు అవసరమైన పనులు చేపట్టాలని అప్పటి మాత్రమే ప్రజల హర్షిస్తారని తెలిపారు.

బట్టి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం: మడిపల్లిగోపాలరావు 

 మధిర నియోజకవర్గంలో భట్టి అభివృద్ధి శంకుస్థాపనలకు, కాగితాల రూపంలో మాత్రమే చూపించడం జరుగుతుందని మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తెలిపారు. బట్టి ఇప్పటికే కోట్ల రూపాయలతో మధుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని కాగితాల రూపంలో మాత్రమే తెలిపారు కానీ ఆచరణలో ఎక్కడా చేపట్టలేదని అన్నారు. నగర మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ నిర్మించలేక పోవడం వల్ల  ఎంట్రన్స్ లో దుర్వాసనతో స్వాగతం పలుకుతుంది అన్నారు.

సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని నేటికీ ప్రారంభించలేదని, విద్యుత్ అండర్ డ్రైనేజీ వ్యవస్థను, సిరిపురంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలార్ సిస్టం చేపట్టలేదని, ఎలా కోట్ల రూపాయలతో వాగ్దానం ఇచ్చి ఎక్కడ పనులు చేపట్టకుండా కాగితాల రూపంలో కొట్ల రూపాయలు చూపించి తమకమేషను దండుకుంటున్నారని దీని ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలిపారు. ఇప్పటికైనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లానాయకులు శీలం నరసింహారావు పట్టణ కార్యదర్శి పడకండి మురళి, మండల కార్యదర్శి ఎం సైదులు, మందడ ఉపేందర్ పట్టణ కమిటీ సభ్యులు పుచ్చకాయ కిషోర్, ఫాతిమా బేగం, అనుముల భాస్కరరావు గిరిశాల  జగన్మోహన్రావు మల్లాచారి ఆది వెంకటేశ్వర్లు వెంకటరావు  సుకూర్ సాంబయ్య పట్టణ కమిటీ సభ్యులు శాఖా కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.