26 April, 2026 | 10:33 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రూ.69 కోట్లపై సీబీఐ దర్యాప్తు జరపాలి

06-03-2026 02:12 AM

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్

క్విడ్ ప్రోకో ఒప్పందంతో దోచుకున్నారు : గురువారెడ్డి

జి.వివేక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై చర్యలకు డిమాండ్

హైదరాబాద్, మార్చి 5 : విశాఖ ఇండస్ట్రీస్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చె ల్లించిన రూ.69 కోట్లపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. క్రికెట్ అభివృద్ధి నిధుల దుర్విని యోగంపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) డిమాండ్ చేసింది. హెచ్‌సీఏ, విశాఖ మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందంతో నిధులు దోచుకున్నారని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన పలు పత్రాలను మీడియాకు విడుదల చేశారు.

ఈ అక్రమాలకు బాధ్యులైన జి.వివేక్, హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు చెందిన నిధులను రక్షించడంలో హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగా విఫలమైందని ఆరోపించారు. బీసీసీఐ సూ చనల మేరకు టీసీఏ, హెచ్‌సీఏ కలిసి సమావేశాలు నిర్వహించి క్రికెట్ అభివృద్ధిపై నిర్ణ యాలు తీసుకోవాలని గురువారెడ్డి డిమాం డ్ చేశారు. ఫిబ్రవరి 18న జస్టిస్ పి.నవీన్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో హెచ్‌సీఏ క్రికెట్ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించలేదని ఆయన విమర్శించారు.

ఈ సమావేశంలో టీసీఏ తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించిందని తెలి పారు. టీసీఏతో కలిసి పనిచేసే విషయంపై కోర్టు ఆదేశాలను సైతం హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదన్నారు. టీసీఏ సమర్పించిన ప్రతిపాదనలకు హెచ్‌సీఏ స్పందించలేదని, కేవలం బీసీసీఐ నుంచి వచ్చే నిధులపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.హెచ్‌సీఏపై నమోదైన కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని, దీనిపై సీఐడీ, రాష్ట్ర డీజీపీని కలిసి మరోసారి ఫిర్యాదు ఇవ్వనున్నట్టు తెలిపారు.