24 August, 2026 | 11:32 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

జేకేఓసీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్

17-06-2025 12:00 AM

ఓసీ పనులు నిలిపివేసిన అఖిల పక్షం 

ఇల్లెందు, జూన్ 16 (విజయక్రాంతి):సింగరేణి జే కే ఓసీ విస్తరణ పనులు ప్రారంభించడానికి సింగరేణి అధికారులు పూనుకొని పూసపల్లి అడివి, పొలాలలో డోజర్ తెచ్చి పనులు చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న సాగుదారులు అఖిలపక్షం నాయకులకు విషయం తెలిపారు.

వెంటనే అఖిల పక్ష బృందం కూడా పని ప్రదేశానికి నిర్వాసితకు 2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని సింగరేణి క్వార్టర్ల లో నివసిస్తున్న వారికే అప్పగించాలని ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో త్రాగు నీరు పారిశుధ్యం రోడ్లు డ్రైనేజీ పనులు ఇందిరమ్మ ఇళ్లు సింగరేణి సంస్థ ద్వారానే నిర్మించాలి నిర్వాసితులకు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని కూడా సింగరేణి సంస్థ మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిరుద్యోగ యువత కు ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

పై సమస్యలు పరిష్కరించకుండా ఓసీ పనులు సాగనివ్వమని హెచ్చరించారు. సింగరేణి ఎస్ ఓ టు జీ ఎం రామస్వామి, ప్రాజెక్ట్ అధికారి, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇల్లందు ఎస్ ఐ హసీనా, పోలీస్ సిబ్బంది, ఎస్ & పీ సీ సెక్యూరిటీ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు భారీ స్థాయిలో మోహరించారు. అయినా అఖిలపక్షం పట్టు విడవకుండా డోజర్ ఎదుట నిలబడి నిరసన తెలిపారు. సింగరేణి అధికారులు పోలీస్ రెవెన్యూ అధికారులు వెను తిరిగి వెళ్లారూ.

ఈ కార్యక్రమం లో అఖిల పక్ష నేతలు అబ్దుల్ నబి, పూనెం సురేందర్, మంచాల వెంకటేశ్వర్లు, వెన్నంపల్లి శ్రీనివాస్, హరికృష్ణ, దనసరి రాజు, తాండ్ర నాగరాజు, సదరం మహేష్, చందవత్ రమేష్, గుళ్ళ మొగిలి, గుళ్ళ సదయ్య, లాలు, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.