24 August, 2026 | 10:22 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

జర్నలిస్టుల వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వండి

17-06-2025 12:00 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కోరిన ప్రెస్ కమిటీ సభ్యులు

వనపర్తి, జూన్ 16 ( విజయక్రాంతి ) : జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల వాహనాలకు గుర్తింపుగా ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వాలని సురవారం ప్రతాప్ రెడ్డి ప్రెస్ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసిన ప్రెస్ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు ప్రెస్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... విధినిర్వహణలో జర్నలిస్టులకు పోలీసులు విధిస్తున్న ఫైన్ లతో సతమతమవుతున్నారని తెలిపారు. పత్రికా సమావేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల కవరేజ్ చేయడానికి హడావిడిగా వెళుతున్న సందర్భాల్లో వి ధుల్లో ఉన్న పోలీసులు జర్నలిస్టుల వాహనాలకు ఫైన్ లు వేస్తున్నారని అన్నారు.

ఈ సమస్య నుంచి జర్నలిస్టులకు ఉపశమనం కల్పించాలని, అందుకోసం పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన జర్నలిస్టు ప్రెస్ స్టిక్కర్లను అందించి ఫైన్ ల నుంచి విముక్తి కల్పించాలని కోరారు.

స్పందించిన జిల్లా ఎస్పీ త్వరలోనే జర్నలిస్టు ల వాహనాల కోసం ప్రత్యేకంగా ప్రెస్ స్టిక్కర్లు తయారుచేసి అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ కమిటీ సభ్యులు బోలేమోని రమేష్, బొడ్డుపల్లి లక్ష్మణ్, యాదిరెడ్డి, కుమార్, శేఖర్ యాదవ్, శ్రీనాథ్, పురుషోత్తం, ప్రవీణ్, గోపాలకృష్ణ, తిరుపతి, గట్టు శేఖర్, ముంత రవి, ఫోటో జర్నలిస్ట్ అంజి తదితరులు పాల్గొన్నారు.