ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నందుకే కూల్చివేత
ఎన్ కన్వెన్షన్‌కు అనుమతి లేదు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): తుమ్మిడికుంట చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండటం కారణంగానే ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్‌ను కూల్చివేసి నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాల కారణంగా దిగువ ప్రాంతాలు మునిగిపోతూ స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్టు తెలిపారు. కూల్చివేతల సందర్భంగా రంగనాథ్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
మాదాపూర్, హైటెక్స్ పరిసర ప్రాం తాలను అనుసంధానించే నాలాలలో నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి 60 శాతం తగ్గిందని చెప్పారు. ఫలితంగా వర్షాలు కురు స్తు న్న సమయంలో ఈ ప్రాంతాలు తరచూ ముంపునకు గురవుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2.18 ఎకరాలు ఆక్రమించి అనధికారికంగా నిర్మాణం చేసినట్టుగా తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని స్పష్టంచేశారు.
ఈ విషయంపై 2014లో హెచ్‌ఎండీఏ తమ్మిడికుం ట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్, 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన 2014లోనే సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలియజేశారు. ఈ సమయంలో ఎఫ్‌టీఎల్ నిర్దారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రి యను అనుసరించాలని హైకోర్టు ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రకారం ఎన్ కన్వె న్ష న్ యాజమాన్యం సమక్షంలోనే ఎఫ్‌టీఎల్ సర్వే నిర్వహించి, నివేదికను సైతం వారికి అందజేసినట్టు వెల్లడించారు.
2017లో సర్వే నివేదికపై జిల్లా కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు. అంతేకానీ, ఈ విషయంలో ఏ కోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్త ర్వులు లేవని స్పష్టంచేశారు. శనివారం చేపట్టిన ఆక్రమణల తొలగింపు హైడ్రా, జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తొలగించిన అనేక అక్రమ నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటని చెప్పారు. కాగా, హైకోర్టు మధ్యాహ్నం మధ్యంతర స్టే ఇచ్చినట్టు తెలిపారు.






