19 May, 2026 | 5:52 AM

బఫర్ జోన్ కాదు.. చెరువుల్లోనే నిర్మాణాలు

25-08-2024 03:30 AM

శాటిలైట్ ఫొటోలతో అక్రమ నిర్మాణాలు వెలుగులోకి 

ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడుకోవడం మన బాధ్యత 

చట్టానికి లోబడే చర్యలు ఉంటాయి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి): చెరువులు అక్రమించి నిర్మాణాలు చేయ డం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, చెరువులు, ప్రభుత్వ భూమలు అక్రమణలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. హైదరాబాద్ నగరం అంటేనే సరస్సులు, రాళ్లకు నెలవని, వాటిని కాపాడుకోవాలంటూ పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారని గుర్తుచేశారు.

శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని, ప్రతి పనికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో కాదు, నేరుగా చెరువుల్లోనే నిర్మాణాలు చేపట్టారని, వాటిని మాత్రమే కూల్చేస్తున్నారని వెల్లడించారు.

శాటిలైట్ ఫొటోల ద్వారా రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత ఈ పదేళ్ల లో చెరువులు ఎంతమేర అక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫొటోలను తీసి అంతకు ముందు ఎన్ని చెరువులు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్నది ప్రజల ముందు పెడుతామని పేర్కొన్నారు. చట్టప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామని స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.