18 June, 2026 | 1:52 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

18-06-2026 12:00 AM

అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 17: ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూ ర్ మెట్ మండల పరిధిలోని పెద్ద అంబర్ పేట్ రెవెన్యూ సర్వేనెంబర్ 354 కు సంబంధించిన పీఓటీ తీసుకున్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

దీం తో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, జీపీఓ, సిబ్బందితో కలిసి ఆ అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో బుధవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ... ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.