18 June, 2026 | 2:43 AM

ఆ యాంకర్‌ను చూసి రాసుకున్న కథ ఇది

18-06-2026 01:52 AM

‘శుభం’ మూవీ ఫేమ్ యంగ్ యాక్టర్ హర్షిత్‌రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. సరికొత్త ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వస్తునన ఈ సినిమాతో స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న విడుదల కానుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “ఓ రోజు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్, సత్యనంద్ ఉన్నారు. వాళ్లిద్దరు మాట్లాడుతుంటే వెళ్లి మీకు కథ చెప్పాలి సర్ అని అడిగా. వాళ్లు షాక్ అయ్యారు. గీతా ఆర్ట్స్‌కు రా. కథ బాగుంటే సినిమా అవుతుంది. కథ బాగాలేకపోతే టీయో కాఫీయో వేస్ట్ అవుతదన్నారు. ఆఫీసుకు వెళ్తే నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. లోపల సర్ ఉన్నారో లేరో కూడా తెలియదు.

కానీ ఎట్టకేలకు అల్లు అరవింద్ సర్ ముందు కాఫీ తాగటానికి 20 ఏళ్లు పట్టింది. కథ నచ్చింది. కాఫీ వేస్ట్ కాలేదు. కాలేజీ కథ కాదు. దివాన కథ చెప్పా. సినిమాలో ఆరు పాటలుంటాయి. మూడు ఫైట్లు ఉంటాయి. మీరు ఎంతైనా బడ్జెట్ ఇవ్వండి.. అన్నీ చేస్తా అని చెప్పా. నేను డెమో చేస్తే సినిమా కన్నా బాగుంటుంది. రూ.5 వేలతో డెమో తీశా. 69 రోజుల్లో తీయాల్సింద కథ అని చెప్పగానే 30 రోజుల్లో తీయమని చెప్పారు. ఇదే విషయం మా ఫ్రెండ్స్‌ను అడితే ముందైతే సినిమా మొదలుపెడదాం అన్నారు. 42 రోజులు అయ్యింది. ఇంకా ఐదారు రోజుల కంటెంట్ తీయలేదు.

‘దీవాన’ కథ జెమిని టీవీలో ఓ యాంకర్‌ను చూసి రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో వచ్చేంది. ఎంబీఏ పూర్తి చేశాక జాబ్ కోసం ప్రయత్నించకుండా సినిమా కోసం ఆగిపోయా. పొద్దున లేస్తే టీవీ చూస్తుండగా యాంకర్ కనిపించింది. వెళ్లి ఆ అమ్మాయిని కలిస్తే ఎట్లుండది, కలిస్తే ఏమవ్వొచ్చు, గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి కలిస్తే ఏం జరుగుతుందనే ఆలోచన తట్టింది. దీంట్లో ఎమోషనల్ ప్లస్ కమర్షియల్ కథ ఉంది. ఇది రాయాలనుకున్నా. ప్రతి మనిషిని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ బాగా నచ్చుతాయి. నా కథలో హీరోది వన్ సైడ్ లవ్వే. హీరోయిన్ వెనుకపడుతుంటాడు. సెకండాప్‌లో వన్ సైడ్ లవ్వే ఉంటుంది కానీ వెనుకపడేది ఉండదు” అని చెప్పారు.