6 May, 2026 | 1:53 AM

యంనంపేట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

06-05-2026 12:00 AM

ఘట్ కేసర్, మే 5 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి యంనంపేట్ లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. క్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులను కూల్చివేయించారు. అనుమతులు ఒక విధంగా తీసుకుని, నిర్మాణాలు మరొక విధంగా చేపడుతున్నారనే ఫిర్యాదులు వరుసగా రావడంతో అధికా రులు రంగంలోకి దిగారు. ప్రారంభంలో ఫిర్యాదులపై అధికారులు కాలయాపన చేసినప్పటికీ, చివరకు అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ కూల్చివేతలు చేపట్టారు.