calender_icon.png 14 September, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేతలు ఓల్డ్‌సిటీ నుంచి ప్రారంభించండి

24-01-2025 12:59:40 AM

  1. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
  2. చింతల్‌బస్తీలో ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతలపై ఫైర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతలను మొదట పాతబస్తీ నుంచే మొదలు పెట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై సీరియస్ అయ్యారు. అధికా లకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ ప్రభుత్వాలు మనుగడలో ఉండవని, అధికారులు ప్రభు  ఆధ్వర్యంలోనే పనిచేయాలని హితవు పలికారు.

బుధవారం ఖైరతాబాద్ చింతలబస్తీలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించిన విషయమై ఎమ్మెల్యే దానం గురువారం ఆదర్శ  జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరోసారి స్పందించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎలాంటి నోటీ  ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీశారు.

అధికారులు చేసే పనుల కారణంగా ప్రజాప్రతినిధులుగా మేము ప్రజల్లో తిరగలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పుట్టి  తనకు రాజకీయ జీవితం ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు ఆపద వస్తే అండగా ఉంటానన్నారు.

అధికారులు బదిలీలు అయితే ఒకచోట నుంచి మరోచోటికి వెళ్తుంటారు. కానీ ప్రజాప్రతినిధులు స్థానికులకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుం భ్నురు. ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని దానం స్పష్టం చేశారు.