26-06-2025 04:37:13 PM
బిజెపి మండల అధ్యక్షుడు సుదర్శన్..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వర్కట్ పల్లి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలలో గల డాక్టర్, ఫార్మసిస్ట్, అటెండర్ డిప్యూటేషన్ రద్దు చేయాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్(BJP Mandal Party President Bolla Sudarshan) అన్నారు. గురువారం వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బిజెపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యశాల తలుపులు మూసి ఉండడం, ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం కనిపించింది.
ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ... వర్కట్ పల్లి ఆయుర్వేద డాక్టరు, ఫార్మసిస్ట్, అటెండర్ తమ పరపతిని ఉపయోగించి ఆర్ఎం స్థాయిలో పైరవీలు చేసి డిప్యుటేషన్ పై భువనగిరి మండలంలోని బొల్లెపల్లిలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వర్కట్ పల్లి ఆయుర్వేద వైద్యశాలకు వచ్చే రోగులకు డాక్టరు, సిబ్బంది లేక వెనుతిరిగి వెళుతున్నారని ఆయన అన్నారు. జీతం వర్కట్ పల్లిలో తీసుకుంటూ విధులు బోలేపల్లిలో నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారికి తెలియజేసి డిప్యుటేషన్ రద్దు చేయాలని కోరారు.
డిప్యూటేషన్ రద్దు చేయకుంటే డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడిస్తామని అప్పటికి స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నాగేల్లి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి లోడ్ లింగస్వామి, రాజేశ్వర చారి, శ్రీశైలం, స్వామి, సాగర్, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.