26 August, 2026 | 4:10 PM

India vs Sri Lanka 2nd Test: సెంచరీకి చేరువలో సూర్యబండార

26-08-2026 03:38 PM

కొలంబోలో భారత్, శ్రీలంక జట్ల(India vs Sri Lanka 2nd Test) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు 'టీ' విరామ సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పసిందు సూరియబండార భారత బౌలర్లను ఒక పూర్తి సెషన్ పాటు సమర్థవంతంగా ఎదుర్కొని, అజేయంగా 91 పరుగులు సాధించి జట్టును నిలబెట్టాడు.

విరామ సమయానికి కెప్టెన్ ధనంజయ డి సిల్వా (4) సూర్యబండారకు జతగా నిలిచాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు భారత్ కంటే 14 పరుగుల వెనుకబడి ఉంది. అయితే, ఇన్నింగ్స్ మధ్య దశలో సూరియబండార, కమిందు మెండిస్ (55, 92 బంతులు) మధ్య మూడవ వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ చేసింది. ప్రస్తుతం శ్రీలంక బ్యాటర్లు  సూరియబండర 165 బంతుల్లో 91 పరుగులు, డి. డి సిల్వా 42 బంతుల్లో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక  58.5 ఓవర్లకు  నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.