19 August, 2026 | 5:24 PM

విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై విచారణ జరపాలి

19-08-2026 04:40 PM

బెజ్జంకి: బెజ్జంకి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం గౌడ్ డిమాండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.