పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ డబ్బాలు అందించిన సర్పంచ్ పగడాల రమాదేవి
దమ్మపేట,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు తడి, పొడి చెత్తతో పాటు శానిటరీ, హానికర చెత్తను సైతం విధి విడిగా సేకరించాలని ఉద్దేశ్యంతో బుధవారం దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో చెత్త సేకరణ డబ్బాలను, హ్యాండ్ గ్లౌజులను సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, కార్యదర్శి బండి అనంత్ కుమార్, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము తదితరులతో కలిసి పారిశుధ్య సిబ్బందికి అందజేశారు.
చెత్త సేకరణపై అవగాహన కల్పించి గ్రామస్తులకు సైతం అవగాహన కల్పించాలని కోరారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపి, శానిటరీ చెత్త, హానికర చెత్తను ప్రభుత్వ ఆదేశిత సంస్థలు సేకరించనున్నాయన్నారు. పంచాయతీ కార్మికులు తడి చెత్త అనగా ఆహార వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు, పండ్ల తొక్కలు, పొడి చెత్త పదార్థాలైన ప్లాస్టిక్, కాగితం, అట్ట ముక్కలు, ఇనుము, గాజు, శానిటరీ చెత్త పదార్థాలైన డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, న్యాప్ఫిన్స్, హానికర చెత్త వ్యర్థాలైన మెడికల్ వ్యర్థాలు, పాడైన ఎలక్ట్రానిక్ వసువులు, పెయింటింగ్ డబ్బాలు లాంటి చెత్తను వేరుగా చేసి ఆయా చెత్త డబ్బాలలో వేయాలని పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ ప్రజలకు సూచించారు. గ్రామస్థులు విడి విడిగా చెత్తను వేరుగా చేసి పంచాయతీ కార్మికులకు అందించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సహకరించాలని కోరారు.






