16 July, 2026 | 1:44 PM

ఖమ్మం రైతు ఆత్మహత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

03-07-2024 08:13 PM

హైదరాబాద్: ఖమ్మం రైతు భోజడ్ల ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం అని, మనిషి పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదని ఆయన చెప్పారు. రైతు ఆత్మహత్యకు కారణమయిన వారని పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇంకేవరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవాదని కోరారు.