పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలిక వాయిదా
న్యూఢిల్లీ : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్సించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ఏఐసీసీ వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతల చర్చ అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పీసీసీ పదవి కోసం ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమర్ లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు పీసీసీ పదవిని అడుగుతున్నట్లు విశ్వనియవర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడి నియామకం తరువాతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది.






