calender_icon.png 23 July, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ఇచ్చిన మద్దతు పార్లమెంటులోనూ ఇవ్వాలి

22-07-2025 06:15:03 PM

హైదరాబాద్: కులగణను క్యాబినెట్, శాసనసభలో ప్రవేశపెట్టామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశంలోనే చరిత్రాత్మకంగా మారిందని, కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తలపెట్టామని తెలిపారు. కులగణన అవసరం లేదని కేంద్రంలోని బీజేపీ మొదట మాట్లాడిందని, తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఒత్తిడితో జనగణనలో కులగణన చేస్తామని మోదీ ప్రకటించారని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని, ఈ బీసీ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీల మద్దుత పొందే ప్రయత్నం చేస్తామన్నారు.

42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, తెలంగాణ  అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన పార్టీలు పార్లమెంటులోనూ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆయన మాట ప్రకారంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన సర్వేను పూర్తి చేశామని వివరించారు. 

జాతీయస్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణది కీలకపాత్ర అని, తెలంగాణ కులగణన సర్వే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందుకెళ్తామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రామచందర్ రావుకు బీసీలంటే చిన్న చూపు ఉన్నట్లుందని భట్టి విమర్శించారు. రామచందర్ రావు పంపిన లీగల్ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసాని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను బీఆర్ఎస్ మభ్యపెట్టింది కాబట్టి.. అందరూ అలాగే చేస్తారని అనుకుంటుందేమో అని భట్టి పేర్కొన్నారు.

కులగణన సర్వేను చాలా పకడ్చందీగా, పారదర్శకంగా చేశాం కాబట్టే తెలంగాణను చూసి కేంద్రం కూడా ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలో జరిగిన విధానమే రేపు దేశవ్యాప్తంగా అమలుకానుందని, కేంద్రం జనగణన, కులగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్రంలో మద్దు ఇచ్చిన పార్టీలు పార్లమెంటులో వ్యతిరేకిస్తాయని భావించటం లేదని భట్టి విక్రమార్క అన్నారు.