22-07-2025 06:13:39 PM
ఎస్సై అరుణ్ కుమార్..
దౌల్తాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఎస్ఐ అరుణ్ కుమార్(SI Arun Kumar) అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల(Doultabad Mandal) పరిధిలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, నూతన చట్టాలు, హెల్మెట్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయని అపరిచిత వ్యక్తులు ఫోన్లో చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎక్కడైనా వాటిని విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. మోటార్ సైకిల్ వినియోగించినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తమ తల్లిదండ్రులకు గుర్తు చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వంగ మహేందర్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాసిత్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, మధుర కవి, శ్రీధర్, యాదగిరి, కిషన్ రెడ్డి, రాజు, రమేష్, సాగరిక, చందు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.