13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

జపాన్‌కు డిప్యూటీ సీఎం భట్టి

01-10-2024 02:27 AM

మూడు రోజులపాటు పర్యటన 

పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం జపాన్‌కు వెళ్లారు. భట్టికి జపాన్‌లోని హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాశ్ స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించనున్నారు. జపాన్‌లో పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై భారత రాయబారి సీబీ జార్జి డిప్యూటీ సీఎంకు వివరించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలతో మంగళవారం డిప్యూటీ సీఎం రౌండ్ టేబుల్ సమావేం నిర్వహిస్తారు.

పారిశ్రామిక వేత్తలతో విడివిడిగా సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం యమాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను సందర్శిస్తారు. 2వ తేదీన తోషిబా, కవాసాకి, యాక్లహామ పరిశ్రమలను సందర్శిస్తారు. 3వ తేదీన ఒకాసలోని పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శిస్తారు. 4న డిప్యూటీ సీఎం బృందం హైదరాబాద్‌కు చేరుకుంటుంది. భట్టి వెంట ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణరావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు.