28 May, 2026 | 2:50 AM

టిప్పర్ ఢీకొని ఉప సర్పంచ్ మృతి

28-05-2026 02:02 AM

సుల్తానాబాద్ , మే 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రా మానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్ రెడ్డి తన బైక్ పై నాంసానిపల్లి గ్రామా నికి చెందిన పోతుగంటి రాజుతో ఇద్దరు కలిసి బై క్ పై కరీంనగర్ వెళుతుండగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఎస్సారెస్పీ కెనాల్ దగ్గరికి చేరుకునేసరికి కరీంనగర్ వైపు బూడిద లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ డ్రైవరు త న వాహనాన్ని అతివేగంగా ఆజాగ్రత్తగా నడి పి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు కూడా కిందపడగా కోట నిరంజన్ రెడ్డి నడుం పై నుండి లారీ టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలై అంబులెన్స్ లో ఆసుపత్రి చేరుకునేసరికి మృతి చెందినట్లు ఎస్త్స్ర చంద్రకుమార్ తెలిపారు, అదేవిధంగా పోతుగంటి రాజుకు గా యలయ్యాయి, మృతుడి భార్య కోట అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్త్స్ర చంద్రకుమార్ డ్రైవర్ పెంచాల రవీందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు,