గల్ఫ్ కార్మికుడి ఆత్మహత్య
28-05-2026 02:02 AM
వేములవాడ, మే 27,(విజయక్రాంతి): వేములవాడ గ్రామీణ మండలం, బొల్లారం గ్రామానికి చెందిన సుద్దాల వేణు (36) అనే గల్ఫ్ కార్మికుడు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక సిరిసిల్ల పట్టణంలోని తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం మాల్దీవులకు వెళ్లిన వేణుకు అక్కడ సరైన పని దొరకకపోవడంతో ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
అప్పుల భారం, కుటుంబ పోషణ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బొల్లారం గ్రామ సర్పంచ్ సండేసరి సౌజన్య - మల్లిఖార్జున్, గ్రామస్తులు కోరారు.






