5 May, 2026 | 3:14 AM

దగ్ధమైన పంట.. రైతులను ఆదుకోవాలి

05-05-2026 01:51 AM

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కె.కవిత

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మం డలంకనుగుట్టలో ప్ర మాదవశాత్తు వంద ఎకరాలకుపైగా మొక్కజొన్న పంట దహనం కావడంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి కవిత ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీఆర్‌ఎస్ నాయకులు బానోత్ మౌనికతో క లిసి  రైతులతో ఫోన్‌లో  ధైర్యంగా ఉండాల న్నారు. ప్రభుత్వం  స్పందించి  పంట దహనమై నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కవిత డిమాండ్ చేశారు.