26 June, 2026 | 6:30 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

అభివృద్ధి పేరిట విధ్వంసం

02-04-2025 01:04 AM
  1. భూముల విక్రయం పేరుతో మూటల వేట
  2. పేదల ఇండ్లపైకి.. మూగజీవాల పైకీ బుల్డోజర్లు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): సర్కార్ హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజల ఇండ్లు కూల్చివేస్తున్నది. భూముల విక్రయం పేరిట హెచ్‌సీయూలో పక్షుల గూళ్లను తొలగిస్తున్నది. నోరున్న జనంతో పాటు నోరు లేని మూగజీవాల మీదకూ బు ల్డోజర్‌ను వదులుతున్నది. హైడ్రా.. మూసీ.. భూముల విక్రయం పేరిట.. అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టిస్తున్నది.’

అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళవారం హెచ్‌సీయూ భూముల విక్రయ వివాదంపై ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘పంటలు ఎండుతున్నాయి. సాగునీరు లేదంటూ రైతుల గోస పడుతున్నారు. సర్కార్ మాత్రం బుల్డోజర్ రాజకీయాలకు తెరతీసింది. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు వన్యప్రాణాల హాహాకారాలు చేస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చారు.

భావిత రాల వెలుగులైన విద్యార్థులకు చదువులు చెప్పే చోట విధ్వంసం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ‘ప్రజలను పాలించే నాయకుడివా? లేదంటే భూములను చెరబట్టే రియల్ ఎస్టేట్ మధ్యవర్తివా ?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశా రు. ‘ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లి.. భూములను చెరబడతావా ?’ అంటూ నిలదీశారు.