26 June, 2026 | 6:52 PM

Breaking News

సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు

26-06-2026 06:15 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పాత జెండా వద్ద మొహరం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం పీరీలను పట్టణంలో పలు వీధుల గుండా ఊరేగింపు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కొబ్బరి కుడుకల దండలు, పూల దండలు వేసి మో క్కులు చెల్లించుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఎంతో వైభవంగా జరిగిన వేడుకలు శుక్రవారం రాత్రి పీరిలను ఊరేంపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు ఎండి సుల్తాన్, రఫిక్, ఫయాజ్, శంకర్, గౌస్, అజ్జు తో పాటు పలువురు పాల్గొన్నారు.