26 June, 2026 | 6:56 PM

Breaking News

సిద్దిపేట జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నత్తి శివకుమార్   •   ఉరి వేసుకుని వార్డు మెంబర్ ఆత్మహత్య   •   ఎల్లమ్మ ఆలయానికి రూ.50 వేల విరాళం...   •   ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •  

యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి

26-06-2026 06:08 PM

కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు

తుంగతుర్తి,(విజయక్రాంతి): రైతులకు ప్రభుత్వం అందిస్తున్న యూరియాను యాప్ ద్వారా కాకుండా నేరుగా ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర సభ్యుడు కొరిశెట్టి యాదగిరిరావు అన్నారు. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... ఈ యాప్ ద్వారా యూరియాను అందించడం ద్వారా ఎక్కువ మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారణ వ్యక్తం చేశారు. చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం చేత ఓటిపి చెప్పే సమయంలోనే యూరియా పూర్తిగా అయిపోతుందని దీని చేత ఎక్కువ మంది రైతులు యూనియన్ పొందలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రభుత్వం ఇది విషయంలో జోక్యం చేసుకొని నేరుగా రైతులకు యూరియాని అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసాను వానకాలం పంట ప్రారంభమైనందున వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసాను వేయాలని వారు కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తుంగ తుర్తి ప్రభుత్వ దవాఖానాలలో అందుబాటులో సరయిన వైద్యులు లేరనీ అన్నారు విద్య వైద్యం పై దృష్టి పెట్టాలని ప్రజలకు ప్రభుత్వ సేవల ద్వారా ప్రయోజనం పొందేవిధంగా కృషిచేయాలని సిపిఎం పార్టీ కోరుతుందన్నారు.