10 June, 2026 | 2:51 AM

వంట నూనెల ప్యాక్ సైజుల నిర్ణయం

10-06-2026 12:21 AM

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన ఫ్రీడమ్ ఆయిల్స్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీకరిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్‌ను ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ స్వాగతించింది. ప్రభుత్వం లీగల్ మెట్రాలజీ కింద వినియోగదారుల వ్యవహారాల శాఖ 200 ఎంఎల్/గ్రా, 500 ఎంఎల్/గ్రా, లీటర్ నుంచి 20 లీటర్ వరకు నిర్దిష్ట ప్యాక్ సైజులను మాత్రమే ప్రామాణీకరించింది.

దీనివల్ల మార్కెట్‌లో పారదర్శ కత పెరిగి, వినియోగదారులు సులభంగా ధరలను పోల్చుకుని కొనుగోలు చేయవచ్చు. ప్యాక్ పరిమాణంపై స్పష్టత ఉండాలని మొదటి నుంచి కోరుతున్న ఫ్రీడమ్ ఆయిల్స్, ఇప్పటికే ‘ప్యాక్ రివ్యూ సిస్టమ్’, ‘చునా లగా’, ‘ధ్యాన్ సే లిజియే’ వంటి ప్రచారాల ద్వారా వినియోగదారులలో నికర బరువు, లేబులింగ్ పై నిరంతరం అవగాహన కల్పిస్తోంది.

పి. చంద్రశేఖరరెడ్డి (సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్) మాట్లాడుతూ.. ‘ఇది వినియోగ దారుల కేంద్రీకృత చర్య. ఈ నిర్ణయం పరిశ్రమ వ్యాప్తంగా స్థిరత్వాన్ని, న్యాయమైన పద్ధతులను మరింత పటిష్టం చేస్తుంది. ప్రభుత్వానికి మా ధన్యవాదాలు’ అని చెప్పారు. చేతన్ పింపల్‌ఖటే (మార్కెటింగ్ హెడ్) మాట్లాడుతూ.. ‘వినియోగదారులు సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునేలా స్పష్టమైన సమాచారంతో వారిని శక్తివంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. మా అవగాహన కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తాం’ అని అన్నారు.