10 June, 2026 | 2:50 AM

రేప్కో బ్యాంకులో ఆఫర్లు

10-06-2026 12:19 AM

తక్కువ వడ్డీతో రుణాలు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రేప్కో బ్యాంక్‌లో ఖాతాదారుల కోసం ‘రేప్కో ఫార్చ్యూన్ ప్లస్‘ పేరుతో ఒక ప్రత్యేక డిపాజిట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపక్ మిశ్రా తెలిపారు. ఈ స్కీమ్ కింద అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నారు. గడువు 12 నెలలు అయితే సాధారణ పౌరులకు వడ్డీ రేటు 7.75%, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.25% గా అందిస్తున్నారు.

ప్రజల్లో పొదుపు అలవాట్లను ప్రోత్సహించడంతో పాటు, పూర్తి భద్రతతో కూడిన అధిక లాభాలను అందించడమే ఈ ప్రత్యేక క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ మద్దతు ఉన్న సంస్థ కావడం, మార్కెట్లో మంచి పోటీతో కూడిన వడ్డీ రేట్లు ఇస్తుండటంతో... సురక్షితమైన, లాభదాయకమైన డిపాజిట్ ప్లాన్ల కోసం చూసేవారికి ‘రేప్కో ఫార్చ్యూన్ ప్లస్‘ ఒక అద్భుతమైన పెట్టుబడి అవకాశమని ఆయన పేర్కొన్నారు.