పొల్యూషన్ ఉంటే.. ఆ ఫ్యాక్టరీ తరలిస్తాం
- విద్యావంతులను చేద్దాం..కార్మికులను కాదు
- ఇంథనాల్ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చింది బిఆర్ఎస్
- రూ. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం
- మంచి భవిష్యత్తు ముఖ్యం...పక్కన నా భూములు లేవు
- విజయ క్రాంతి దినపత్రిక ప్రతినిధి తో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కలకలం కరువు జిల్లాగా పేరుగాస్తూ వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మార్చేలా ప్రజాపాలన ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆవిష్కృతం చేయడం జరిగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. విజయ క్రాంతి దినపత్రిక ప్రతినిధితో దేవరకద్ర ఎమ్మెల్యే సీసీ కుంట మండలం దమగ్నపుర్ గ్రామం ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కు సంబంధించి ప్రత్యేకంగా సంభాషించారు.
మారుమూల ప్రాంతం అంటూ బీఆర్ఎస్ నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తే ఎంతోమంది విద్యావంతులు తయారవుతారని ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎక్కడ చేపట్టిన అక్కడ కార్మికులే ఉంటారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయని ఆ గ్రామాలలో వేలాది జనం ఉన్నారని అక్కడ వారికి అనారోగ్యం పాలైతే ఎవరు గ్యారెంటీ అవుతారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హయాంలోనే ఇక్కడ అనుమతులు వచ్చాయని విమర్శించారు.
కేవలం ఫ్యాక్టరీని కాపాడుకోవాలనే సంకల్పంతోనే వారు ఆందోళనలు చేపడుతున్నారని రూ 200 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల ను నిర్మించకూడదు అంటే భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఉండకూడదు అనేలా బీఆర్ఎస్ నాయకులు సంతకాలు చేయకరణ చేపడుతున్నారని విమర్శించారు. అవసరమైతే ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని సంతకాల సేకరణ చేసేది పోయి వద్దు అంటూ సంతకాల సేకరణ చేయడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాలు సైతం అద్భుతంగా అభివృద్ధి చెందాలని సంకల్పంతోనే ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. 25 ఎకరాల ప్రభుత్వ స్థలం అక్కడ ఉందని అంతస్థలం ఇతర ప్రాంతంలో లేదని అన్ని విధాలుగా ఆలోచించి ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సంకల్పంతోనే సమాంతర అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
పాఠశాల ఉంటుంది.. పొల్యూషన్ ఉంటే ఫ్యాక్టరీ ఉండదు
విద్యార్థుల భావితరాల భవిష్యత్తు లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని నిజంగానే పొల్యూషన్ ఆ ఫ్యాక్టరీ ద్వారా ఉంటే ఆ ఫ్యాక్టరీ అక్కడ నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆ ప్రాంతంలో ఎంతో మంది జనం ఆయా గ్రామాలలో నివాసం ఉంటున్నారని అటువంటి పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీని తీసుకువచ్చి అక్కడ ఎందుకు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో చిన్నారులు బిడ్డలు మహిళలు వృద్ధులు ఎంతోమంది జీవనం కొనసాగిస్తారని అలాంటి ఫ్యాక్టరీ ఉంటే అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఆ ఫ్యాక్టరీకి రక్షణ కవచంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఫ్యాక్షరికి అండగా ఉండాలని సంకల్పంతోనే వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీని తీసుకువచ్చి ప్రజల మధ్య ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని పొల్యూషన్ ఆ ఫ్యాక్టరీ ద్వారా లేదని అనుమతులు ఇచ్చారని ఇప్పుడు వారే పొల్యూషన్ ఉంది అంటున్నారని పొల్యూషన్ ఉన్నట్లు తేలితే ఆ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితులను అక్కడ ఉంచమని తరలిస్తామని స్పష్టం చేశారు. పాఠశాల నిర్మాణం చేపడితే అక్కడ నా భూములకు ధరలు పెరగవని అక్కడ నా భూములు లేవని చెప్పారు. అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.






