21 April, 2026 | 2:13 PM

అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ— రైతుల ఆందోళన

21-04-2026 12:13 PM

ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మేకల తండ రైతులు...

కారేపల్లి,(విజయక్రాంతి): మేకల తండ గ్రామానికి చెందిన రైతులు తమపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు సింగరేణి  మండల కేంద్రంలోని  ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.రైతుల వివరాల ప్రకారం, తుమ్మలకుంటలో చేపల లూటీ ఘటనపై ఏర్పడిన వివాదమే ఈ పరిస్థితికి కారణమని తెలిపారు. ఈ ఘటనలో  ఇరు వర్గాల మధ్య తలెత్తిన గొడవను పోలీసులు ఒక వర్గం రైతులపై కేసులుగా మలిచారని వారు ఆరోపించారు. అధికారులు అక్కడికి చేరుకొని  రైతులను కిందకు దింపి వారితో మాట్లాడగా తమపై నమోదైన కేసులను రద్దు చేయాలని రైతులు కోరారు,ఈ సమస్యను విచారణ జరిపి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.