calender_icon.png 11 August, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

11-08-2025 04:49:06 PM

సిపిఎం మండల పార్టీ కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి...

నూతనకల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని సిపిఎం మండల పార్టీ కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి(CPM Mandal Secretary Kandala Shankar Reddy) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాసరావుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానించి బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించగా ప్రస్తుతం పరిశీలనలో ఉందన్నారు.

ఇప్పుడు మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ వద్దకు బీసీలకు రిజర్వేషన్లను వర్తింప చేస్తామని చెబుతూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీలపైన ప్రేమ గాని రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించాలన్న ఆలోచన గాని లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొట్ల లింగయ్య,పులిసరి వెంకట ముత్యం, శ్యామ వెంకటరెడ్డి,బాణాల నర్సిరెడ్డి, కూసు బాలకృష్ణ,దాసరి రవి, పెద్దింటి వినయ్ రెడ్డి,కూసు అశోక్ తదితరులున్నారు.