24-09-2024 12:00:00 AM
‘వికసిత భారత్’ స్వప్నాన్ని 2047 నాటికి సాకారం చేసుకోవడాని కి దేశ సమ్మిళిత సుస్థిరాభివృద్ధితోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడ డం అనివార్యమని అందరూ తెలుసుకోవాలి. ఉద్యోగ ఉపాధుల కల్పనలో పు రుషులతోపాటు మహిళలు కూడా విజ యం సాధిస్తేనే సులభంగా భారత ప్రభు త్వ లక్ష్యాలు సిద్ధిస్తాయి. భారత ప్రభుత్వ గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం, గడచిన పదిహే ను ఏండ్లు పైబడిన మహిళల ‘లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్’ (ఎల్‌ఎఫ్‌పీఆర్) 2017--18లో 24.6 శాతం ఉండగా, 2022--23లో 41.5 శాతానికి పెరిగింది.
ఇది నిజానికి కొంత ఊరటను ఇచ్చే విష యం. పట్టణ మహిళల ఎల్‌ఎఫ్‌పీఆర్ (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్) 2017--18 లో 20.4 శాతం నమోదు కాగా, 2022--23లో 25.4 శాతం వరకు చేరడం గమ నించారు. 2022-23లో గ్రామీణ పురుషుల్లో ఎల్‌ఎఫ్‌పీఆర్ 80.2 శాతం ఉండ గా, పట్టణ పురుషుల్లో 74.5 శాతం ఉంది.
ఏయే రంగాలలో ఎవరెవరు?
గ్రామీణ మహిళల్లో 74 శాతం వరకు వ్యవసాయం లేదా వ్యవసాయాధారిత రంగంలో మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. వ్యవసాయ/ వ్యవసాయ అను బంధ రంగాలతోపాటు విద్య (4.1 శా తం), రిటైల్ వ్యాపారాలు (3.4 శాతం), వ స్త్ర పరిశ్రమ తయారీ రంగాలు (3.1 శా తం), నిర్మాణ రంగాల్లో (2.5 శాతం) గ్రా మీణ మహిళలు పని చేస్తున్నారు. పట్టణ మహిళలు అధికంగా విద్యా రంగం (12.6 శాతం), గృహ పనులు (11.6 శాతం), రి టైల్ వ్యాపారాలు (10.7 శాతం), వ్యవసా య అనుబంధ రంగాలు (9.6 శాతం), రె డీ మేడ్ వస్త్ర పరిశ్రమల్లో (8.5 శాతం) ప ని చేయడం గమనించారు.
గత ఆరేండ్లు గా గ్రామీణ మహిళలు స్వయం సహాయక బృందాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) ద్వారా కొంతవరకు ఊరటను పొందారు. జాతీ య ఎల్‌ఎఫ్‌పీఆర్‌తో పోలిస్తే 13 రాష్ట్రాల ఎల్‌ఎఫ్‌పీఆర్ తక్కువగా ఉండడం గమనార్హం. దేశంలోనే యూపీ, అస్సాం, బీహా ర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దాదాపు 44 శాతం గ్రామీణ మహిళల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది.
నైపుణ్య శిక్షణ అనివార్యం
2022--23లో నమోదైన పిఎల్‌ఎఫ్‌ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) వివ రాల ప్రకారం, డిగ్రీ లేదా ఆపై పట్టాలు పొందిన మహిళలతో (గ్రామీణం 26 శా తం, పట్టణ మహిళలు 29 శాతం పని పొందారు) పోల్చితే వొకేషనల్ శిక్షణ/ డి ప్లొమా చేసిన మహిళలకు 37 శాతం ఉ ద్యోగ ఉపాధులు దొరుకుతున్నట్లు స్ప ష్టమైంది. డిగ్రీ పట్టా పొందిన మహిళలక న్నా డిప్లొమా మహిళలు తక్కువగా ఉం టున్నారు. దీంతో ఉద్యోగ ఉపాధుల క ల్పనలో సానుకూల ప్రగతి సాధించడం లో విఫలమవడం జరుగుతున్నది. ఉద్యో గ - ఉపాధుల కల్పనకు నేటి యువతకు యూనివర్సిటీ డిగ్రీలతోపాటు వృత్తి రం గాల్లో శిక్షణ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలను పెంచడం అనివార్యమని తె లుస్తున్నది.
ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అనుబంధ రంగాలు/ ఫుడ్ ప్రాసెసింగ్/ రెడీ మేడ్ వస్త్ర పరిశ్రమ లు/డిజిటల్ కామర్స్/ నాణ్యత పరీక్షలు/ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్/ ప్యాకింగ్ లాం టి రంగాలకు సంబంధించిన శిక్షణలు ఇ వ్వడానికి ‘స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు’ల ను, సంస్థలను పెంచవలసిన అగత్యం ఏ ర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ వంటి రాష్ట్రాలు స్కిల్ యూనివర్సిటీలను/ వొకేషనల్ కోర్సుల సంస్థలను నెలకొల్పడం ఆ హ్వానించదగిన పరిణామం. ఇదే క్రమం లో కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి 1,000 ఐటీఐలను ఆధునీకరించ డానికి, 500లకు పైగా పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయించడానికి నిధులు కే టాయించడం సంతోషదాయకం.
పరిస్థితులు చక్కదిద్దాలి
భారత మహిళలు ఉద్యోగ - ఉపాధు ల్లో చేరడానికి పని ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలను (బేబీ కేర్ సెంటర్స్) ఏ ర్పాటు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. దేశ మహిళల్లో అధిక శాతం గృ హ సంబంధ విధుల్లోనే (52 శాతం గ్రామీ ణ, 57 శాతం పట్టణ మహిళలు) మగ్గుతున్నార ని తేలింది. దేశ మహిళల్లో 80 శా తానికి పైగా పిల్లల పెంపక బాధ్యతలు, గృ హ నిర్వహణ విధుల్లోనే తమ జీవితాలను గడుపుతున్నారనే కఠిన వాస్తవం మహిళ ల దుస్థితిని తెలుపుతున్నది.
ఇది స్త్రీ సమాజాన్ని అధికంగా వేధిస్తున్నది. ప్రతి రోజు సగటున మహిళలు 5 గంటలు, పురుషు లు 1.5 గంటలు గృహ సంబంధ పనిలో నిమగ్నమవుతున్నారని ఓ ప్రభుత్వ సర్వే వివరించింది. అధిక శాతం మహిళలు పి ల్లల పెంపకం, పిల్లలతో హోం వర్క్స్ చే యించడం, వంట, ఆహారం వడ్డించడం, బట్టలు ఉతకడం, ఇళ్లు శుభ్రం చేయడం, వృద్ధుల ఆలనా పాలనా, దివ్యాంగుల సే వలు, అనారోగ్యం పాలైన కుటుంబ స భ్యులకు సేవలు అందించడం వంటి డొమెస్టిక్ పనుల్లోనే గడుపుతున్నారనడానికి అనేక అనుభవాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇలాంటి ప్రధాన కారణాలతో భారతీ య మహిళలు ఇంటికే పరిమితమవుతూ సామాజిక, ఆర్థిక ప్రగతి బాటలకు దూరమవుతున్నారు. పని కల్పనలో పురుషుల కు ధీటుగా మహిళా లోకాన్ని కూడా జా గృత పరచాలి. అప్పుడే పని ప్రదేశం లో లింగ వివక్ష తగ్గి ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటుంది. పని కల్పనలో లింగ సమాన త్వం సాధిస్తేనే సమ్మిళిత అభివృద్ధి నమో దై ‘వికసిత భారత్’ స్వప్నం సాకారమవుతుంది.
2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందడానికి భారతీయ స్త్రీలను ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. వారి అర్హతలను పెంచుతూ, తగిన ఉద్యోగ ఉపాధులను కల్పించే దిశగా ప్రభుత్వాలు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. వంట గదిలోంచి ఉద్యోగాల విఫణి వీధుల్లోకి మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున రప్పించడానికి ప్రజలందరూ తోచిన మేర చొరవ తీసుకోవాల్సిన సమయమిదేనని ఇప్పటికైనా గుర్తించాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్: 9949700037