11 March, 2026 | 2:04 PM

Breaking News

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •   తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం   •  

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

21-01-2026 12:57 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 20 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి 58వ డివిజన్ ఎన్జీవోస్ కాలనీ లో పైప్ లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అన్ని డివిజన్ లలో సమిష్టి అభివృద్ధి జరుగు తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి చారించామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం కాజీపేట రైల్వే సంఘం కార్యాలయంలో పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సంఘం తరఫున విడుదల చేసిన ప్యాకెట్ డైరీలను ఆవిష్కరించారు. పెన్షనర్లు సమాజానికి అందించిన సేవలు ఎనలే నివని వారి సమస్యల పరిష్కారానికి, విశ్రాంత ఉద్యోగుల యోగక్షేమాల కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తప్పకుండా స్థలం కేటాయింపు చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి మెరుగు శివ, వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇం చార్జ్ ఎం.డి నేహాల్, ఫిషర్ మాన్ సభ్యులు మండల సమ్మయ్య, 58, 60 డివిజన్ ల అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకొంటి పున్నంచందర్, కాంగ్రెస్ శ్రేణులు తాళ్లపల్లి మేరీ, తాళ్లపల్లి విజయ్, తాళ్లపల్లి రవీందర్ (జెకె), జనగాం శ్రీనివాస్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నేబోయిన శ్వేతా గణేష్, ఎండి సాజిద్, మట్టపల్లి కమల్, పిట్టల వంశీ, తాళ్లపల్లి ప్రసన్నకుమార్, ఇల్లందుల భాస్కర్, కాలనీవాసులు కనకయ్య, ప్రసాద్, అంజన్ రావు, పాపారావు, అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.