21-01-2026 12:57:59 AM
సికింద్రాబాద్, జనవరి 20(విజయ క్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆవరణలో గెజెట్ ప్రతులు, కుర్చీని దగ్దం చేసిన సంఘటనలో బీఆర్‌ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ తో పాటు మరికొంత మంది బీఆర్‌ఎస్ నాయకులపై మారేడు పల్లి పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
ఈనెల 18న బీఆర్‌ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ అనే వ్యక్తి నేతృత్వంలో దా దాపు 10-15 మంది వ్యక్తుల బృందం అనధికారికంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిందని, బోర్డుఅధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ బృందం ప్రాంగణం వెలుపల నుండి ఒక కుర్చీని తీసుకెళ్లారని, బోర్దు కార్యాలయ ఆవరణ లోకి ప్రవేశించిన తర్వాత,ఆ కుర్చీకి నామినేటెడ్ సభ్యుడు అని రాసి ఉన్న కాగితాన్ని ఉంచి, ఉద్దేశపూర్వకంగా కుర్చీకి నిప్పంటించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.. ఈ చర్యల వల్ల సమీపంలో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ,పెద్ద అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
కుర్చీని తగలబెట్టిన తర్వాత, ఆ బృందం కాలుతున్న కుర్చీని కార్యాలయ ప్రాంగణంలోనే వదిలేశారని, అనుకోని ప్రమాదం జరిగి ఉంటే , ప్రభుత్వ ఆస్తి, ప్రజా భద్రత ముఖ్య మైన అధికారిక రికార్డులకు తీవ్ర ముప్పు కలిగేదని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ సంఘటన మొత్తం కార్యాలయ ప్రాంగణ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన పీసీ కెమెరాలలో రికార్డయిందని పేర్కొన్నారు.
2015 సంవత్సరం నుండి కంటో న్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడం ,నామినేటెడ్ సభ్యుని పదవిని అదనంగా ఒక సంవత్సరం పాటు పొడిగించినందుకు సంబంధించి ఈ చర్య జరిగినట్లు బావిస్తన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బోర్డు అధికా రులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని,ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు, న్యాయ ప రమైన అంశాలపై కోర్టు అనుమతి కోరారు. కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకోనున్నారు.