అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్సీ దండే విఠల్
బెజ్జూర్, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): అధికార పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బెజ్జూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ పద్మ శంకర్, వార్డు సభ్యులు, యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ పద్మా శంకర్ సూచిం చిన విధంగా గ్రామంలోని సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించేందుకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు అధైర్యపడ వద్దని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి అండగా ఉంటుందని చెప్పారు. పోడు రైతుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాచకొండ శ్రీ వర్ధన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూష శంకర్, ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్, మాజీ జెడ్పీటీసీ పుష్పలత, మాజీ సర్పంచ్ సుగుణ, మాజీ ఉపసర్పంచ్ బాబురావు, నాయకులు నహీర్ అలీ, కుడ్రం గి రామకృష్ణ, పెంటన్న, గోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






