15 April, 2026 | 5:49 PM

నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

29-12-2025 12:00 AM

నిర్మల్ డిసెంబర్ 28 (విజయక్రాంతి) :  సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమ లులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని అన్నా రు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురిం చి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే, ఈ విషయాన్ని గమనించి, కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదులను సమర్పించవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.