కాంగ్రెస్‌తోనే అన్ని రంగాల అభివృద్ధి
l ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు
కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అ న్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తర ఫున ప్రచారం నిర్వహించిన ఆయన ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుల సంక్షే మం గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు.
ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, త్వరలోనే వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు. అనంతరం సదాశివనగర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ లింగా గౌడ్, మండల అధ్యక్షుడు సంగారెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి, యూత్ అధ్యక్షుడు అన్వేష్ గౌడ్, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






