20 May, 2026 | 7:11 PM

ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటే ప్రధానం

21-04-2024 01:18 AM

l జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థను బలో పేతం చేసేందుకు, హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు విని యోగించడంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతోంది. ఈ సందర్భంగా రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధు లు, ఎన్‌జీవోలు, విద్యా సంస్థల్లో, బస్తీలు, కాలనీల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటు చైతన్యాన్ని పెంచుతోంది.

ఓట రు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉన్నట్టు కాదనీ, కచ్చితంగా ఓటరు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఫారం దరఖాస్తు చేసుకుంటే ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్టు ప్రచారం చేస్తోంది. అందుకు ఈ నెల 23 వరకూ గడువు ఉన్నట్టు పేర్కొన్నారు. ఓటింగ్ రోజును సెలవు రోజుగా భావించకుండా ఓటు వేయడం మన భాధ్యతగా ఓటర్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు.