ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి నిరసన సెగ
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కార్యకర్తలతో కలసి గ్రామంలో నూతన సిసి రోడ్ల నిర్మాణ వచ్చిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డిని రోడ్డుపై ఆపి నిలదీసి అడిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు.
వివిధ పార్టీల నుండి వలసలుగా వచ్చిన వారిని కలుపుకొని సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరైనది కాదని ఎన్నో సంవత్సరాలు పార్టీకి మేము కష్టపడి పని చేస్తుంటే మాకు గుర్తింపు ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు.






