24-05-2025 11:38:46 PM
జూన్ చివరి నాటికి హౌజింగ్ కాలనీ ఇండ్లు పూర్తి చేయాలి..
అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా నిరుద్యోగులకి ఉపాధి కల్పన..
రోడ్ల పనులు నాణ్యతగా ఉండాలి..
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి..
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హుజూర్ నగర్: హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి ఒక యజ్ఞంలా తలపెట్టి రాజకీయాలకి తావు లేకుండా అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఉత్తమ పట్టణంలోని రామ స్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇండ్లను, 30 కోట్లతో నిర్మించే అడ్వాన్స్ టెక్నాలజి సెంటర్, 6.0కోట్ల రూపాయలతో నిర్మించే ఐ టి ఐ కాలేజీ, 8 కోట్ల రూపాయలతో నిర్మించే ఆర్ & బి గెస్ట్ హౌజ్, ఔటర్ రింగ్ రోడ్డు, 4.5 కోట్లతో నిర్మించే డిగ్రీ కాలేజీ, 8. 5 కోట్లతో నిర్మించే జూనియర్ కాలేజీ నిర్మాణ పనులను రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... రామస్వామి గుట్ట వద్ద ఇండ్లు అన్ని జూన్ చివరి నాటికి పూర్తి చేసి జులై -ఆగస్టు లో ఇండ్లు లేని నిరుపేదలని గుర్తించి ఇండ్లు పంపిణి చేయాలని పనులు అన్ని వేగవంతంగా నాణ్యతగా ఉండాలని ఆదేశించారు.అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిరుద్యోగులకి ఉపాధి కల్పనకి గొప్ప అవకాశం అని ఏ టి సి ద్వారా అడ్వాన్స్ స్కిల్స్, రోబో టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్, ప్రాసెసింగ్ టెక్నాలజీ లాంటి వాటిపై 170 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటం జరుగుతుందని జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేసి జులై నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు.
తదుపరి ఆర్ & బి, డి యం ఎఫ్ టి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లు అన్ని వేగవంతంగా నాణ్యతగా నిర్మించాలని, రోడ్లు వేసేటప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ అడ్డు ఉంటే వాటిని తొలగించాలని అధికారులకి ఆదేశించారు.ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ సూర్యనారా యణ,ఆర్ & బి ఎస్ ఈ సీతారామయ్య,పి ఆర్ ఈ ఈ వెంకటయ్య తహసీల్దార్ నాగార్జున రెడ్డి,హౌజింగ్ ఎస్ ఈ వెంకటదాస్ రెడ్డి, డి ఈ జగన్, ఏ ఈ సాయిరాం రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.