24-05-2025 11:32:04 PM
బీఅర్ఎస్ పార్టీ నాయకుడు అభిమన్యు రెడ్డి..
రాజాపూర్: మారుగుణపడిపోతున్న మన తెలంగాణ జనపదకళాలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని బీఅర్ఎస్ పార్టీ నాయకుడు అభిమన్యు రెడ్డి(BRS party leader Abhimanyu Reddy) అన్నారు. శుక్రవారం మండలంలోని చోక్కంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ అది చింతల మునిరంగ స్వామి వీది నాటకమును ప్రారంభించారు. మునిరంగా స్వామి నాటకానికి చేయూత అందించిన అభిమన్యు రెడ్డిని భజన మండలి భక్తులు శాలువలతో సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... శ్రీశ్రీశ్రీ చింతల మునిరంగా స్వామి వారి వీధి నాటకం వేయడం నిజంగా అభినందనీయమని సినిమా ప్రపంచంతో అంతరించిపోతున్న పురాతన కళలకు జీవం పోయడం అభినందనీయమని అన్నారు. చాలా కాలం తర్వాత వీధి నాటకం ప్రజల మధ్యలో కలిసి చూడడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డుమెంబెర్స్, గ్రామ పెద్దలు, భక్త మండలి, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.